Bsnl 4g Will Tentatively Launch On March 1 2020 And To Announce 4g Only Plans
BSNL 4G వచ్చేస్తుంది.. మిగతా నెట్ వర్క్ లకు షాక్.. ఎప్పుడో తెలుసా?
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) 4జీ సేవలను ప్రారంభించనుందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ప్రారంభించనుందనే దానిపై సరైన క్లారిటీ ఎవరికీ లేదు. 2020లోనే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని గత సంవత్సరమే క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ఎట్టకేలకు బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై ఓ క్లారిటీ వచ్చింది(?).
టెలికాం టాక్ వెబ్ సైట్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ సర్వీస్ అండర్ టేకింగ్స్(PSU) ఈ అంశంపై ఇప్పటికే టెలికాం శాఖను సంప్రదించింది. కాబట్టి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ అయితే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ సబ్ స్క్రైబర్ బేస్ కు భారీ గండి పడే అవకాశం ఉంది.
4జీ సేవల కోసం సుమారు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కలలు ఫలించే సమయం వచ్చింది. ఇప్పటికీ ఎన్నో సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ సేవలనే ఇంకా అందిస్తుంది. కొన్ని సర్కిళ్లలో మాత్రం 3జీ స్పెక్ట్రంను ఉపయోగించి 4జీ సేవలను అందిస్తోంది. రానున్న ముంబై, ఢిల్లీ సర్కిళ్ల కంటే ముందు మిగతా 20 సర్కిళ్లలో బీఎస్ఎన్ఎల్ సర్వీసులు అధికారికంగా ప్రకటించబడే అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment