telugu viral news
13 July
telugu viral news
పురాతన విగ్రహాన్ని స్కాన్ చేస్తూ ఖంగుతిన్న అధికారులు.. లోపల ఏం ఉందంటే.?
అది ఒక పురాతన బుద్ధ విగ్రహం.. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడింది. దాని మూలాలు ఏంటని తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని స్కాన్ చేయగా....
Mummified Monk Inside Buddha Statue:
అది ఒక పురాతన బుద్ధ విగ్రహం.. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో బయటపడింది దాని మూలాలు ఏంటని తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని స్కాన్ చేయగా.. వారు అందులో కనిపించిన దాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అందులో ఉన్నది ఏంటంటే.? ఒక మనిషి అస్థిపంజరం. నెదర్లాండ్స్‌లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసిన అధికారులు ఖంగు తిన్నారు.
వారికి ఆ విగ్రహంలో ఓ మనిషి అస్థిపంజరం కనిపించింది. అది దాదాపు వెయ్యి ఏళ్లు.. అనగా 11వ శతాబ్దం లేదా 12 శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అచ్చం మమ్మీ సినిమా మాదిరిగా దాని చుట్టూ వస్త్రం కప్పి ఉండటమే కాకుండా చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయట. దీనితో శాస్త్రవేత్తలు లోతుగా పరిశీలించగా..
అది చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ద సన్యాసిది అని తేలింది. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని పరీశీలనలో ఉంచిన అధికారులు దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.