Daily Current Affairs

Latest courses

3-tag:Courses-65px

The key character has become a bit of a guest character

కీలక పాత్ర కాస్త అతిథి పాత్రగా మారిందా..!





మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే







మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాలు పాటు చెర్రీ పాత్ర ఉండబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇందులో చెర్రీ కోసం ఓ హీరోయిన్‌ను పెట్టాలనుకుంటున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర నిడివికి కొరటాల కత్తెర వేశారట. రామ్ చరణ్‌కి డేట్ల విషయంలో క్లాష్‌ ఉండకూడదనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతకుముందు చెర్రీది కీలక పాత్ర అనుకున్నప్పటికీ.. ఇప్పుడు అతిథి పాత్రగా మారిందట. ఈ మార్పుకు చిరు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి, కొడుకులు కలిసి ఈ సినిమాలో తక్కువ సేపు మాత్రమే కలిసి నటించనున్నారు.




కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు రెండు పాత్రల్లో నటించనున్నారు. అందులో ఒకటి నక్సలైట్ కాగా మరొకటి ప్రొఫెసర్‌. ఇక ఇందులో కాజల్ మరోసారి చిరు సరసన జత కట్టబోతోంది. సోనూసూద్, అజయ్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment

Breaking