బంగారం ధర వెలవెలబోయింది. మరోసారి దిగొచ్చింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశం. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది
ప్రధానాంశాలు:
- దిగొచ్చిన బంగార ధర
- వెండి పరుగు
- గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పైకి
- దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.220 తగ్గుదలతో రూ.48,100కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.1090 పెరిగింది. రూ.49,600కు ఎగసింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,100కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.50,710కు క్షీణించింది.
పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1090 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1795 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరుగుదలతో 18.62 డాలర్లకు చేరింది.
No comments:
Post a Comment